calender_icon.png 20 August, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జవాబు దారితనంగా ఉండాలి

19-08-2025 10:50:58 PM

అదనపు  కలెక్టర్ శివేంద్ర ప్రతాప్

అడ్డాకుల:  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ సియేంద్ర ప్రతాప్ సందర్శించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని గదులను పరిశీలించి వర్షానికి ఎలాంటి ఇబ్బందులు లేవా అని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ముజాసిర్ హుస్సేన్ ను అడిగి తెలుసుకున్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎలాంటి సమస్యలు లేవని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ కు డాక్టర్ వివరించారు.

అనంతరం మండల కేంద్రంలోని ఎస్సీ వీర పల్లె దేవన్న ఇల్లు వర్షానికి పెంకల ఇల్లు కూలిపోవడం జరిగింది. ఇట్టి  పిఎమ్ఎ వై సర్వే పనితీరు ఎంపీడీవో సద్గుణ ఎంపీఓ అనురాధ పంచాయతీ కార్యదర్శి సరస్వతితో కలిసి పరిశీలించగా కూలిపోయిన ఇల్లును పరిశీలించారు. బాధితులు వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది. ఇల్లు నిర్మించుకుంటానని ఇల్లు ఇవ్వమని  అడిగారు.

అనంతరం తాసిల్దారు శేఖర్ తో మాట్లాడుతూ... మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా అని అడగగా ఎలాంటి సమస్యలు లేవని తాసిల్దార్ అదనపు కలెక్టర్ కు వివరించారు. తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లే దారిలో వర్షం నీరు నిలవడంతో అట్టి గుంతలో మట్టి వేసి క్లియర్ చేయాలని తాసిల్దారు శేఖర్ కు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ సూచించారు. తాసిల్దారు వెంటనే స్పందిస్తూ వెంటనే అతి గుంతలను పూడ్చివేసి క్లియర్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.