17 April, 2026 | 3:33 AM

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అడిషనల్ డీజీపీ

17-04-2026 01:49 AM

వరంగల్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా గురువారం దర్శించుకున్నారు. ఏసిపి శుభం ప్రకాష్, అడిషనల్ ఎస్పీ మనిషాతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించుకుని అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు టక్కరు సత్యమయ్య, ధర్మకర్త తోనుపునూరి వీరన్న వారికి అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు.