03-05-2025 01:12:21 AM
కరీంనగర్ క్రైం, మే 2 (విజయ క్రాంతి): కిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఆడియోస్ పేరుతో శుక్రవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశం అలరించింది. ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని, ముందుకు సాగండి, ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేయండి, అది కేవలం జ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.
కిమ్స్ విద్యాసంస్థల వైస్ ఛైర్మెన్ సాకేత రామారావు మాట్లా డుతూ పుపంచం నలుమూలలా హోటల్ రంగం అభివృద్ధి చెంది, టూరిజం ప్రపంచం నలుమూలలకు విస్తరించిందన్నారు. మాకిమ్స్ విద్యార్థులు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మంచి ఉద్యోగాలు సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గౌతమ్, ప్యాకల్టీ రి అజయ్, సతీష్, సాయిబాలు, చంద్రకళ, సిరీష, విద్యార్థులు పాల్గొన్నారు.