calender_icon.png 4 May, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాషేతర ప్రాంతాల్లో హిందీ భాషాభివృద్ధికి కృషి

03-05-2025 01:13:35 AM

హిందీ ప్రచార సభ వార్షికోత్సవం సందర్భంగా గవర్నర్‌కు ఆహ్వానం

ముషీరాబాద్, మే 2 (విజయక్రాంతి): హిందీ ప్రచారసభ హైదరాబాద్ స్థాపించబడి 90 సంవత్సరములైన సందర్భంగా మే చివరి వారంలో జాతీయ స్థాయిలో  నిర్వహించనున్న 90వ వార్షికోత్సవ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు.

ఈ మేరకు శుక్రవారం  హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్. గైబువల్లితో నేతృత్వంలోని ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శాలువా, జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించారు.

అనంతరం ఎస్.గైబువల్లి మాట్లాడుతూ హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమా ల్లో గతంలో భారత ప్రథమ రాష్ట్రపతి డా బాబూ రాజేంద్ర ప్రసాద్, పూర్వ రాష్ట్రపతులు జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాల్ శర్మ, ఉప రాష్ట్రపతులు బి.డి.జిత్తి, పూర్వ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు, లోక్ సభ స్వీకర్ హుకుమ్ సింగ్, హోం మంత్రి ఎస్.బి.చౌహాన్, సుష్మా స్వరాజ్ తో పాటు అనేక మంది గవర్నర్లు, కేంద్ర మంత్రు లు హాజరయ్యారని గుర్తు చేశారు.

హిందీ భాషేతర ప్రాంతాలలో హిందీ భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తూ 90 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందీ ప్రచార సభ ప్రతినిధులకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో హిందీ ప్రచార సభ హైదరాబాద్ న్యాయ సలహాదారులు జె.వెంకటరామ్ నరసింహా రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ శృతికాంత్ భారతి, తెలంగాణ హిందీ ప్రచార సభ అధ్యక్షుడు కె.రామచందర్, సెక్రటరీ ఏ.కె.రాజు, ఉద్యోగుల సంఘం సెక్రటరీ శివలింగం తదితరులు పాల్గొన్నారు.