విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
07-05-2024 12:58 AM
ఆదిలాబాద్, మే 6 (విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచే అత్యున్నత లక్ష్యాలను సాధించాలన్న పట్టుదలతో చదవాలని, తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ ప్రణీతతో కలిసి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ అభిజ్ఞన్, ఎంఈవో జయశీల, జిల్లా సైన్స్ అధికారి రఘు రమణ, హెచ్‌ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.




