8న వరంగల్‌కు ప్రధాని మోదీ
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
వరంగల్ తూర్పు, మే 6 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల ౮న వరంగల్‌కు ప్రధాని మోదీ రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలిపారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో దేశా న్ని ముందుకు తీసుకువెళుతున్న ప్రధాని హాజరుకానున్న సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం వరంగల్ ఓసిటీలోని క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన తూర్పు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలిపిన మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెం ట్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపును కాంక్షిస్తూ బుధవారం ఉదయం మామునూ రు లక్ష్మిపురంలో ఏర్పాటు చేస్తున్న సభకు రాష్ట్ర ముఖ్య నాయకులు, ఎంపీ అభ్యర్థులతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాల నాయకులు హాజరు కానున్నారని తెలిపారు.




