15-05-2025 04:51:05 PM
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ దక్షిణ కాశి కాళేశ్వరంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలు(Saraswati Pushkaram) మే 15 నుంచి 26 వరకు జరుగనున్నాయి. పవిత్ర సరస్వతీ పుష్కరాలకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) త్రివేణి సంగమంకు చేరుకున్నారు. వేదపండితులు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దేవదయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ తదితరులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.