calender_icon.png 10 October, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఏఎఫ్‌సీ ఫర్నిచర్ సొల్యూషన్స్

10-10-2025 12:03:39 AM

బంజారాహిల్స్, రోడ్ నం.1లో ప్రారంభం

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): మాడ్యులర్, ఎర్గోనామిక్ ఆఫీస్ ఫర్నిచర్‌లో ప్రముఖ సంస్థ ఏఎఫ్‌సీ ఫర్నిచర్ సొల్యూషన్స్ తన ఆధునిక స్టోర్‌ను గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్, రోడ్ నం.1, వంశిరామ్ జ్యోతి ప్రైమ్ బిల్డింగ్‌లోని ఏఎఫ్‌సీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించారు. ఈ స్టోర్ను హైదరాబాద్ రీజినల్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ప్రారంభించింది.

ఇది కార్పొరేట్ సంస్థలు, ఆర్కిటెక్ట్, డిజైనర్లు, క్లయింట్లు ఏఎఫ్‌సీ పూర్తి శ్రేణి మాడ్యులర్ ఫర్నిచర్, ప్రయోగశాలల్లో పరీక్షించిన ఎర్గోనామిక్ కుర్చీలు, సహకార ఫర్నిచర్, వినూత్న వర్క్‌స్పేస్ సొల్యూషన్లను రియల్ టైమ్ సెటప్లలో ప్రత్యక్షంగా అనుభవించేలా రూపొందించబడింది. ఏఎఫ్‌సీ ఫర్నిచర్ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు మానోజ్ తోమర్ మాట్లాడుతూ..

“హైదరాబాద్ దేశంలో అత్యంత చురుకైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆఫీస్ మార్కెట్లలో ఒకటిగా అవతరించింది. 2005లో 200 మిలియన్ చదరపు అడుగులలోపు ఉన్న ఆఫీస్ సరఫరా, 2025 నాటికి దాదాపు ఒక బిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ఈ షోరూమ్ ద్వారా మా ఉత్పత్తుల నాణ్యత, నూతనత, ఆలోచనాత్మకతను కస్టమర్లు ప్రత్యక్షంగా అనుభవించగలరు” అన్నారు.