calender_icon.png 10 October, 2025 | 3:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ధూమపానానికి దూరంగా ఉండాలి

10-10-2025 12:04:21 AM

డాక్టర్ శివ కుమార్

అశ్వాపురం, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని శివ కుమార్ సూచించారు. అశ్వాపురం మం డలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయి న్ 3.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా యువతను ధూమపానానికి దూ రంగా ఉండాలని, పొగాకు వాడకం వల్ల వచ్చే తీవ్రమైన ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.

ముందుగా టొబాకో వినియోగాన్ని నిరోధించేందుకు ప్రతిజ్ఞ చేయించగా, అనంతరం ధూమపానం వల్ల కలిగే హానికర ప్రభావాలపై వైద్యులు వివరించారు. డాక్టర్ శివ కుమార్ మాట్లాడు తూ, పొగాకు వాడకం ఊపిరితిత్తుల క్యాన్సర్ సహా అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది.

యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఎం ఎల్ హెచ్ పి లు, ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లు తదితరులుపాల్గొన్నారు.