calender_icon.png 10 October, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఈవోకు బురిడీ?

10-10-2025 12:02:14 AM

  1. ప్రభుత్వ శాఖలను తప్పుదోవ 

అనుమతి పత్రాలపై కనిపించని డోర్ నెంబర్ 

అసంపూర్తి సమాచారం... నివేదికలో వెల్లడి 

నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహణ 

ఎంఈఓ పనితీరు తేటతెల్లం 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9, (విజయక్రాంతి): విద్యాశాఖ ఉన్నతాధికారులను దగ్గర నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి వర కు అధికారులనందరి నీ బురిడీ కొట్టించి, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలకు పట్టంకట్టించడా మండల విద్యాధికారి అనీ తేటతెల్లమ వుతోంది.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గల నా రాయణ ఇంగ్లీష్ మీడియం అనుమతులు, నిర్వహణ లోని లోపాలపై విజయక్రాంతి దినపత్రికలో వెలువడిన వరుస కథనాలకు స్పందించిన ఆర్ జె డి, ఆ ప్రైవేట్ పాఠశాల కు సంబంధించిన పూర్తి సమాచారం సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదే శించారు.

ఈ నేపథ్యంలో సదరు పాల్వంచ మండలవిద్యాధికారి సమర్పించిన నివేదిక తప్పుల తడిక, అసంపూర్తి సమాచారంతో డీఈఓ కు సమర్పించటం గమనార్హం. మం డల విద్యాధికారి కె.ఎల్.ఆర్ టెక్నో కిడ్స్ పాఠశాలను నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా మార్పు చేశారని, అందుకు ము న్సిపాలిటీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, పోలీస్ శాఖల నుంచి ఎన్‌ఓసి సమర్పించ డం జరిగిందని నివేదికలో సమర్పించారు.

పాఠశాల పేరు మార్పు జరగాలన్న ఓపెనింగ్ పర్మిషన్ తరహాలో అన్ని అనుమతులను పొందాల్సి ఉం టుంది. అంటే సమీప ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎన్‌ఓసి సర్టిఫికెట్ పొందాల్సి ఉంది. అలాంటివేమీ లేకుండానే రెన్యువల్ పర్మిషన్కు సిఫారసు చేయ టం ఎంఈఓ అక్రమాలను తేట తెల్లం చేస్తున్నాయి. వాస్తవంగా ఎన్వోసీల్లో పాఠశాల ఏరియా, ఇంటి నెంబరు పొంద పచ్చాల్సి ఉంది.

వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఇచ్చిన ఎన్వోసీలో ఎక్కడ ఏరియా, ఇంటి నెంబర్ పొందపరచలేదు. కేఎల్‌ఆర్ టెక్నోకిడ్స్ పాఠశాల ఓపెనింగ్ పర్మిషన్ అనుమ తులు, కె ఎల్ ఆర్ టెక్నో కిడ్స్ పాఠశాల యాజమాన్యం నుంచి నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లీజు అగ్రిమెంట్ సమర్పించలేదు. ఓపెనింగ్ పర్మిషన్ లేకుండా రెన్యువల్ పర్మిషన్ ఎలా ఇచ్చారని అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి.

రెన్యువల్ పర్మిషన్ 2023 - 24 నుంచి 2032- 33 వరకు 6వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఆర్జే టి అనుమతులు ఇచ్చారు. ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 2023 - 24 నుంచి 2027- 28 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓ నుంచి అనుమతులు పొంది ఉన్నారు. అనుమతుల పత్రాల్లో నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 20-5-52/11 కేఎల్‌ఆర్ క్యాంపస్, ఫార్మసీ కాలేజీ, 13వ వార్డు పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం అనే స్పష్టం గా ఉంది.

ఆ ప్రాంతం పట్టణ పరిధిలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉంది. ప్రస్తుతం నా రాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నిర్వహణ ఇంటి నెంబర్ 22-2-79/4 పట్టణ పరిధిలోని నెహ్రునగర్‌లో కొనసాగుతోంది. ప్రైవేటు పాఠశా లకు అతి సమీపం లో పలు ప్రభుత్వ ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నా యి. గతంలోఆ ఇం టి నెంబర్లు లో కేఎల్‌ఆర్ టెక్నో కిడ్స్ పాఠశాల నిర్వహించారు.

అనుమతుల సమయంలో కేఎల్‌ఆర్ ఫార్మసీ కాలేజ్ ప్రాంతం చూపడం, ఈ రెండు ప్రాంతాలు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.. నివేదికలు సమర్పించిన మండల విద్యాధికారి ఓపెనింగ్ పర్మిషన్ పరిశీలించకుండా రెన్యువల్ పర్మిషన్కు ఎలా ప్రతిపాదించారని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా అందిన కాడికి పుచ్చుకొని గుడ్డిగా అనుమతులకు సిఫార చేసినట్లు ఆరోపణలు వెలబడుతున్నాయి.

అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను విద్యాశాఖ ఉన్నతాధికారులను సైతం బురిడీ కొట్టించినట్లు నివేదికలో స్పష్టం అవుతుంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభు త్వం అనేక సంస్కరణలతో బతికించే ప్రయ త్నం చేస్తుంటే, క్షేత్రస్థాయి అధికారులు మా త్రం నెల నెల నజరానాలను పుచ్చుకొంటూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఈ సంఘటనతో తేటతల్ల మవుతున్నాయి.

తప్పుడు సమాచారంతో కొనసాగుతున్న నారాయణ ఇంగ్లీష్ మీడి యం పాఠశాల అనుమతులను రద్దు చేయాలని, తప్పుడు నివేదికల సమర్పించే ప్రభుత్వ అధికారులను తప్పుదోవ పట్టించిన మండల విద్యాధికారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.