06-09-2025 06:20:09 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): వినాయక చవితి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరంలో నవ రాత్రులు ప్రతిష్టించిన వినాయకుని చివరి రోజు శనివారం రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రజాప్రతినిధులతో కలిసి వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు కాసుల బాలరాజు తో పాటు ప్రజా ప్రతినిధులను ఆశీర్వదించారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాసుల బాలరాజ్ తో పాటు ప్రజా ప్రతినిధులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నార్ల ఉదయ్ మాజీ ఏఎంసీ ఛైర్మెన్ లు నార్ల రవీందర్, నార్ల సురేష్ నాయకులు గోపాల్ రెడ్డి ఎజాజ్ నాగులగామ శ్రీనివాస్ పిట్ల శ్రీధర్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖాలే ఖ్ ఆత్మ కమిటీ అధ్యక్షుడు మోహన్ నాయక్ పట్టణ మైనార్టీ అధ్యక్షులు అఫ్రోజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హకీమ్ సయ్యద్ ఇలియాస్ అలీ మొహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.