calender_icon.png 7 September, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు వైద్య సహాయం

06-09-2025 08:56:10 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లాలో  అధిక వరదలు సంభవించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆహ్వానం మేరకు శనివారం రామకృష్ణ  మట్ ఆధ్వర్యంలో రాజంపేట మండలంలోని నడిమి తండా, ఎల్లాపూర్ తాండ   గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించి చుట్టుప్రక్కల మొత్తం 7 తండాలకు చెందిన 293 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య శిక్ష చికిత్స చేశారు. రామకృష్ణ మట్   వైద్యులు డాక్టర్   శుష్మిత్, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు  డాక్టర్ తేజశ్వినిలు ప్రజలను పరీక్షించి జలుబు, దగ్గు, తుమ్ములు, నొప్పులు, జ్వరం తదితర వ్యాధులను కనుక్కొని చికిత్స చేశారు. అలాగే వారిలో కొంతమందికి  షుగర్ కూడా ఉన్నట్టు పరీక్షల ద్వారా తెలిసింది.

వీరికి రామకృష్ణ మట్ ద్వారా దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా అందించడం జరిగిందని రామకృష్ణ మట్ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం ఉదయం9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లింగంపేట మండలంలోని పొల్కంపేట్ గ్రామంలో ఒక మెడికల్ క్యాంపు,   రామారెడ్డి మండల కేంద్రంలో మరొక మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని, మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు  కామారెడ్డి పట్టణంలోని జిఆర్ కాలనీలో  ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా ప్రభుత్వ సహకారంతో వరద బాధితులకు వైద్య సాయం అందించనున్నట్లు తెలిపారు.