calender_icon.png 7 September, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేసేలా చర్యలు

06-09-2025 08:35:26 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే విజయరమణా రావు ఫోన్ చేసి  పెద్దపల్లిలో తక్షణమే మరింత ఎక్కువగా యూరియా సరఫరా చేయాలని కోరగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలోని రైతులకు, పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతులకు సరిపడా యూరియా సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  అన్ని చర్యలు చేపట్టిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. పెద్దపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు సరఫరా చేసిన యూరియా, ప్రస్తుతం ఉన్న నిల్వల వివరాలను ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరింత యూరియా త్వరలోనే దిగుమతి అవుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా నిల్వలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని ఆదేశించారు. కొందరు ప్రతిపక్ష నాయకుల కుట్రలతో యూరియాపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు యూరియా అందేలా చూడాలన్నారు.

ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ రైతులకు సరఫరా చేసేలా అధికారులు కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు. కేంద్రం నుండి అందాల్సిన సమయంలో సరిపడా యూరియా జిల్లాకు దిగుమతి కాకున్నా పెద్దపల్లి నియోజకవర్గంలో ముందస్తు చర్యలతో యూరియా ఇబ్బందులు ఎక్కువగా లేకుండా నియంత్రించామని, రైతుల అవసరాల మేరకు యూరియాను అందుబాటులో ఉంచింది పెద్దపల్లి నియోజక వర్గంలో యూరియా కొరత లేకుండా చూస్తానని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కోరారు. అధికారులు ఆదిశగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు.