06-09-2025 09:02:53 PM
వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
జైపూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన ప్రకారం అధికారంలోకి వస్తే వికలాంగులకు రూ. 6 వేలు, వృద్ధులు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేయూత పెన్షన్ దారులకు రూ. 4 వేల పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి నేటికీ 21 నెలలు అవుతున్న ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చెన్నూరు నియోజక వర్గం వీహెచ్పీఎస్ చేయూత పెన్షన్ దారుల సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ఏనాడు పెన్షన్ల కోసం మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచకుంటే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు చేస్తామని, వెంటనే పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు.