calender_icon.png 7 September, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా విధులు నిర్వహించాలి

06-09-2025 08:53:32 PM

సూర్యాపేట,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గ్రామ పరిపాలన అధికారులు విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారుల కౌన్సెలింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  కౌన్సిలింగ్ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, అభ్యర్థి సొంత నియోజకవర్గం  కాకుండా వేరే నియోజకవర్గంలో ఖాళీల జాబితా ప్రదర్శిస్తూ వారి ఐచ్చికాల మేరకు పోస్టింగ్ లు కేటాయించడం జరుగుతుందన్నారు. నియామక పత్రాలు తీసుకున్న గ్రామ పాలన అధికారులు భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు.