06-09-2025 08:59:05 PM
అచ్చంపేట: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి ఆడపడుచుకు మహిళా సంఘాల్లో సభ్యత్వం తప్పనిసరిగా కల్పించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు శనివారం అమ్రాబాద్ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మహిళా సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందిరా క్రాంతి పథకం ఉద్యోగులు గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం బాధ్యతాయుతంగా సేవలందించాలన్నారు. గ్రామాల్లో సభ్యత్వం లేని మహిళలను విఓఎస్ ఇంటింటా సర్వే చేసి మహిళా సంఘాల్లో చేర్చాలని సూచించారు.