06-09-2025 08:38:30 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హన్మకొండ పట్టణంలో గోకుల్ నగర్ వాస్తవ్యురాలు నక్క స్నేహలత యాదవ్ నిరుద్యోగులకి ఉపాధి కల్పించే సంస్థ నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్స్, కొండాపూర్, హైటెక్ సిటీ సంస్థ నందు సీనియర్ ఇన్స్రక్టర్ గా 2007 నుండి విధులు నిర్వహిస్తూ, ఉద్యోగ రీత్యా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలలో ఎందరో నిరుద్యోగులకి, సర్టిఫికెట్ కోర్స్ అండ్ ప్లేస్మెంట్ వంటి వృత్తి విద్యా కోర్సులని అందిస్తూ, వారికి ఉత్తమ బోధన చేస్తూ, ఈ సంవత్సరం నేషనల్ టీచర్స్ అవార్డు 2025 ను మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంటర్ప్యనర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా తెలంగాణ నుండి వీరి సంస్థ తరుపున అవార్డును న్యూ ఢిల్లీ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.