06-09-2025 08:41:49 PM
హనుమకొండ,(విజయక్రాంతి): బంజారా జాతి హక్కుల సాధన కోసం ఈ నెల 9న వరంగల్లో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు లంబాడ హక్కుల ప్రతినిధులు తెలిపారు. లంబాడీలపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల వైఖరి స్పష్టం లంబాడి JAC పిలుపు రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను తొలగించాలంటూ రాజ్యాంగాన్ని ధిక్కరించే పద్ధతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కష్టపడి ఈ దేశ ప్రజలకు అందించిన మహోత్తరమైన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వీరు వ్యవహరిస్తున్నారు.
శాంతి కామకులైన లంబాడి బిడ్డలు ఏనాడు తమ విచక్షణను కోల్పోయి కోయా గోండు బిడ్డలపై అసహనం వ్యక్తం చేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదు. కోయ గోండు రాజకీయ నాయకులు గతంలో లంబాడిలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని హైకోర్టులో కేసు వేశారు చేశారు అట్టి కేసును హైకోర్టు చట్టబద్ధతలేని వాదనను విచారించలేమని కొట్టివేయడంతో ఈ డిమాండ్ ను కోయ గోండు రాజకీయ నాయకులు వదిలేశారు. కొంతకాలం తర్వాత కొద్దిమంది అగ్రవర్ణ రాజకీయ నాయకుల అండ దండతో సుప్రీంకోర్టులో మరోసారి కేసు వేశారు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే.
దేశంలో అన్ని కులాల సామాజిక హోదా ఒకే రకంగా లేదు.కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీ లోను మరియు ఎస్సీ, బీసీ లోను వారి ప్రాంత సామాజిక సంస్కృతిక హోదాను బట్టి కొనసాగుతున్నారు. తెలంగాణ లో ఉన్న లంబాడీలకు వందల సంవత్సరాలు చదువులేదు, ఉపాధి లేదు ముక్యంగా అత్యంత వివక్షతకు దోపిడీకి గురై కులసమజానికి దూరంగా నెట్టివేయబడ్డారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి తెలంగాణలో ఉన్న కోట్లాది మంది ప్రజల యొక్క సామాజి హోదాపై కేంద్ర ప్రభుత్వం వద్ద గానీ తెలంగాణ వద్ద గానీ స్పష్టమైన సమాచారం లేదు కనుక లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేర్చడంలో జాప్యజరిగింది.
రాజ్యాంగ సూత్రాలను అనగా ఆర్టికల్ 342 అనుసరించి మాత్రమే లంబాడీలు ఎస్టీ జాబితాలో నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేర్చాయి అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలు వేసి నిర్ధారించిన తర్వాతనే పార్లమెంట్ బిల్లు అమెండ్మెంట్ ద్వారా లంబాడీలకు ఎస్టీ హోదా దక్కింది. తెలంగాణలో 30 లక్షల వరకు ఉన్న లంబాడి గిరిజనులు అన్ని రంగాల్లో వెనుకపడున్నారు. తండాల్లో అంతర్గత రోడ్లు మురికి కాలలు అసలే లేవు. నేటికిని లంబాడి బిడ్డలు ఇతర వర్గాల చేతిలో మోసాలకు వివక్షతకు దోపిడికి గురవుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో లంబాడీలు ఎస్టీ హోదాను కోల్పోతే భవిష్యత్తు ఆగామ్య గోచరమే అవుతుంది.
కనుక లంబాడీల ఎస్టి హోదాను కచ్చితంగా కాపాడుకునేందుకు ప్రతి లంబాడి బిడ్డ సంతకం కావాలి శాంతియుత మార్గంలో ప్రతి తండా నుండి మండలానికి నియోజకవర్గానికి జిల్లాలకు రాష్ట్ర స్థాయి వరకు ఐక్యతను చాటుకోవాలి శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన రిజర్వేషన్లను కాపాడుకునేందుకు పోరాటం సాగిస్తాము. ఎస్టీ రిజర్వేషన్ కాపాడుకునేందుకు మొదటి దశలో ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా ఈనెల 9న లంబాడీల శాంతి ర్యాలీ వేల మందితో నిర్వహించి ప్రభుత్వ ప్రభుత్వ వైఖరితో పాటు అన్ని రాజకీయ పార్టీల వామపక్షాల వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తాము.