06-09-2025 06:24:20 PM
నాగారం: నాగారం మండలంలోని ప్రాదేశిక ఎన్నికలైన జడ్పిటిసి, ఎంపిటిసిల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో మారయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ముసాయిదా జాబితా పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్న 8 సెప్టెంబర్ వరకు తెలియజేయలన్నారు. నాగారం మండలంలో ఒక్క జడ్పీటీసీ స్థానం, 8 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం ఓటర్ల సంఖ్య 24,755 ,మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 42 కలదు. ఎనిమిదో తేదీన అన్ని రాజకీయ పార్టీ ల నాయకులతో సమావేశం కలదు అని అన్నారు.