2 April, 2026 | 3:18 PM

Breaking News

కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •   ధర్మారం మండల సర్పంచ్ ల పోరం అధ్యక్షుడిగా సంగ రంజిత్ యాదవ్   •  

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..

10-12-2025 12:00 AM

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంకిడి లక్ష్మారెడ్డి

తిమ్మాపూర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తిమ్మాపూర్ సర్పంచ్ భారీలో నిలిచిన మాజీ సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన గ్రామం లో ప్రతి వాడల గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ గ్రా మ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

గ్రామ ప్రజ లతో కలిసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారాల తో గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తానని పేర్కొ న్నారు.గ్రామలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఫంక్షన్ హాళ్లను, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ను ఇచ్చి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉం టనాన్ని పేర్కొన్నా రు.మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో   గెలిపించాలనికోరారు.