01-12-2025 04:50:41 PM
ముకరంపుర (విజయక్రాంతి): ప్రపంచ ఎయిడ్స్ డే ను పురస్కరించుకొని సోమవారం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ రోడ్డులోని ఫిలింభవన్ వరకు కొనసాగింది. ఫిలిం భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ మాట్లాడుతూ దేశంలో హెచ్ఐవి వ్యాధి రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నదన్నారు.
హెచ్ఐవి వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, హెచ్ఐవి కేసులు రాకుండా జీరోకు తీసుకురావాలని, వ్యాధి సోకిన వారు ధైర్యంగా ఉంటూ ఎప్పటికప్పుడు మందులు వాడుతూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, డిటిసిఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సాజిద, డాక్టర్ రాజగోపాల్ రావు, డాక్టర్ సన జవేరియా, డెమో రాజగోపాల్, డిపిఓ ఎన్ హెచ్ ఎం స్వామి, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి నరేందర్, తదితరులు పాల్గొన్నారు.