calender_icon.png 1 December, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయుని కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

01-12-2025 04:56:40 PM

నిర్మల్ రూరల్: నిర్మల్ పట్టణంలోని శాస్త్రినగర్ కాలనీకి చెందిన సీనియర్ పాత్రికేయుడు పూరస్తూ సురేందర్ కుమారుడు సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో సోమవారం డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే బొజ్జ పటేల్ పరామర్శించారు. సాయి చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. ఈయన వెంట స్థానిక నాయకులు శ్రీహరి రావు అర్జున్ మంత్ అలీ వెంబడి రాజేశ్వర్ పార్టీ నేతలు ఉన్నారు.