calender_icon.png 1 December, 2025 | 5:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

01-12-2025 05:01:34 PM

గుండాల (విజయక్రాంతి): మండలంలోని మాసాన్ పల్లి గ్రామానికి చెందిన పాలడుగు సాయి ఉప్పల్ శాంతినగర్ లో డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక సమస్యతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యులను పిఎస్ఆర్ చారిటీ చైర్మన్ పంగ సతీష్ రెడ్డి పరామర్శించి, మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబానికి పది వేల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో యెలిపెద్ది వెంకట్ రెడ్డి,అట్ల రంజిత్ రెడ్డి, చంద్రగిరి యాదగిరి, ఆలకుంట్ల రాజు, పాలడుగు ఎల్లేష్, మెండే గుజ్జుల నరేష్, మహంకాళి రవి, పాలడుగు దేవ, పాలడుగు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.