calender_icon.png 1 December, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలి

01-12-2025 04:42:07 PM

జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు విశ్వేశ్వర్ రెడ్డి..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు బి విశ్వేశ్వర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు, బంజారా, సత్యనారాయణపురం, కోడిపుంజుల వాగు గ్రామపంచాయతీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నామినేశ్వర స్వీకరణ ఏర్పాట్లను తనిఖీ చేశారు. నామినేషన్ల స్వీకరణ పారదర్శకంగా సజావుగా సాగాలని, ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు హెల్ప్ డెస్క్ లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని, అధికారులు సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ ఎంపీడీవో, దమ్మపేట ఏటీడీఓ చంద్రమోహన్ పాల్గొన్నారు.