calender_icon.png 1 December, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగాలి

01-12-2025 04:47:49 PM

మఠంపల్లి: సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలో బుధవారం నుంచి మూడవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా జరిగేలా చూడాలని మఠంపల్లి తహశీల్దార్ లావురి మంగా తెలిపారు. సోమవారం మండలంలోని నామినేషన్ కేంద్రాలను మండల అభివృద్ధి అధికారి జగదీష్, సబ్ ఇన్స్పెక్టర్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నామినేషన్ స్వీకరణ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరినీ మాత్రమే అనుమతించాలని, అలాగే వాహనాలు 100 మీటర్ల దూరంలోనే ఆపేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్న హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవాలని, ఏలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు.