01-12-2025 04:53:35 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రపంచ దేశాలను ఆందోళన చెందిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మించాలంటే ప్రతి ఒక్కరు దానిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వైద్య ఉద్యోగులతో కలిసి పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని అవగాహన ఒకటి మార్గమని వ్యాధి సోకిన వారి పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ వైద్య విధాన పరిషత్ జిల్లా అధికారి డాక్టర్ సురేష్ వైద్యులు పాల్గొన్నారు.