01-12-2025 04:45:11 PM
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రైజింగ్ తెలంగాణ 2047కు పోలీస్ శాఖ మరింత కష్టపడి పనిచేయాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హైదరాబాదు నుంచి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలంగాణ రేసింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాధాన్యతను అన్ని జిల్లాలకు వివరించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో నేరాల తగ్గింపు ఆర్థిక నేరాల నియంత్రణ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై కఠినంగా వివరించడం మాదక ద్రవ్యాల నియంత్రణ పెండ్లి పోలీస్ తదితర అంశాలపై సూచనలు సలహాలు చేశారని జిల్లాలో తప్పకుండా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అవినాష్ కుమార్ జిల్లా పోలీసులు ఉన్నారు.