18-11-2025 08:19:45 PM
నివాళులర్పించిన జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్..
కరీంనగర్ (విజయక్రాంతి): ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి అనారోగ్యంతో సోమవారం రాత్రి కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆయన నివాసంలో మృతి చెందారు. అంతిమయాత్ర మంగళవారం నిర్వహించగా ఢిల్లీ నుండి విచ్చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి దేవరాజన్ తెలంగాణ పార్టీ నాయకులతో కలిసి బండ సురేందర్ రెడ్డి పార్థీవదేహంపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాక్ పార్టీ జెండా కప్పి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండ సురేందర్ రెడ్డి రెండు దశాబ్ద కాలంగా పార్టీ నిర్మాణానికి సేవలు చేశారని కొనియాడారు. బండ సురేందర్ రెడ్డి ఆశయ సాధనకై నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నిర్వహించిన పార్టీ జాతీయ మహాసభలు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. ఈ అంతిమయాత్రలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి, జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుందర రామరాజు, రాష్ట్ర నాయకులు ఆర్ వి ప్రసాద్, గొల్లపల్లి రాజు గౌడ్, బుచ్చిరెడ్డి ,అందె బీరన్న, అతికం రాజశేఖర్ గౌడ్, రాహుల్, అఖిమ్ నవీద్, సూర్య కిరణ్, రోహిత్, బద్రీనేత, ప్రశాంత్, దయానంద్, గణేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన పలువురు నేతలు
బండ సురేందర్ రెడ్డి మృతదేహానికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగదాసు లక్ష్మణరావు, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, పలు వామపక్ష పార్టీ నాయకులు, తదితరులు నివాళులర్పించారు.