18-11-2025 08:22:09 PM
మెదక్ డిఎస్పి ప్రసన్న కుమార్
కొల్చారం: నేరాల నియంత్రణకు కార్టన్ సెర్చ్ దోహదం చేస్తుందని మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ అన్నారు. మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డిఎస్పి ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో మెదక్ సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది రంగంపేటలో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి పోలీసు సిబ్బంది, అధికారులు వాహనాల ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గ్రామపంచాయతీ వద్దకు తీసుకువచ్చి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రామస్తుల ఉద్దేశించి మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడారు. గ్రామాలలో సురక్షితమైన భద్రత ను కల్పించడం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్టివిటీ కార్యక్రమంలో భాగంగా కార్టెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వాహనాలను తనిఖీ చేయడంతో పాటు ఇలాంటి ఆధారాలు లేకుండా గ్రామంలో ఉన్న నూతన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడం గ్రామస్తులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అందుతున్న సేవలను వివరించడం రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించడం సైబర్ క్రైమ్ వల్ల ప్రజలు మోసపోతున్న విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించి ఎవరు సైబర్ క్రైమ్ బారిన పడి మోసపోకుండా చూడడం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నేరం జరిగినప్పుడు ఆధారాలు సేకరించడంలో నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పాటునందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జార్జ్, అల్లాదుర్గం సీఐ రేణుక, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మోహినుద్దీన్, పాపన్నపేట సి పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మెదక్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎస్సైమెదక్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన ఎస్సైలు, ఎఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.