calender_icon.png 25 January, 2026 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన ధీరత్వానికి ప్రతీక ఐలమ్మ

11-09-2024 12:50:35 AM

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్  

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ మహిళాశక్తికి, బహుజన ధీరత్వానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అ న్నారు. తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆమె పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని తెలిపారు. ప్ర జావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని పేర్కొన్నారు. ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిం చేదిశగా ఆమె జయంతిని తెలంగాణ ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు.