11 May, 2026 | 2:43 AM

‘ఎయిర్ ఇండియా’ను కాపాడాలి!

10-05-2024 12:05 AM

టాటా సన్స్ అధీనంలోని ‘ఎయిర్ ఇండియా’లో 300 మం దికి పైగా సిబ్బంది మూకుమ్మడి సెలవులు పెట్టడంతో 86 విమా న సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. బాధితులైన ప్రయాణికుల్లో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ సైతం ఉండటం గమనార్హం. ఒక ప్రతిష్ఠాత్మక సంస్థలో ఉద్యోగులకు ఈ పరిస్థితి ఎదురైనప్పుడు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ‘ఎయిర్ ఇండియా’ సేవలను కాపాడ టంలో ప్రభుత్వం తన వంతు పాత్రను పోషించవలసి ఉంది. 

డి.శ్రీకాంత్‌కుమార్, బెంగళూర్