మహనీయుల చిత్రపటాలు
10-05-2024 12:05 AM
దేశ, రాష్ట్రవ్యాప్తంగా ఎందరో మాహనీయుల జయంతి, వర్థం తి వేడుకలు జరుపుకోవడం మన సాంప్రదాయం. ఈ వేడుకలు ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, వివిధ శాఖా పరమైన కార్యాలయాలలోనూ నిర్వహిస్తుంటారు. అయితే, పూర్తి స్థాయిలో అన్ని కార్యాలయాలలో మన మహనీయుల చిత్ర పటా లు కనిపించవు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా దేశ, రాష్ట్ర నాయకుల చిత్ర పటాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
కామిడి సతీశ్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా






