కూలిన ఎయిర్ ఇండియా విమానం
అహ్మదాబాద్: అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా విమానం(Air India Flight) గురువారం కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు(Ahmedabad Airport)లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ సమయంలో ఈ ఘటన జరిగింది. విమాన కూలిన పరిసరాల్లో పెద్దఎత్తున పొగలు భారీగా కమ్ముకున్నాయి. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమై ఘటనా స్థలానికి 12 ఫైరింజన్లు రప్పించి మంటలను అదుపు చేస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. మేఘని నగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ నుండి భారీ పొగలు కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి.






