04-01-2026 12:31:01 AM
బందీలుగా దేశాధ్యక్షుడు మదురో, సిలియా దంపతులు
రహస్య స్థావరానికి తరలింపు
దాడులతో భయకంపితులైన వెనిజులా ప్రజలు
ఇది అమెరికా దురాక్రమణ: వైస్ ప్రెసిడెంట్ డెల్సీ
దాడి మా పనే: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
* డ్రగ్స్ స్మగ్లింగ్‌కు గేట్లు తెరిచి అమెరికాలోకి మాదకద్రవ్యాలను పంపిస్తున్నారని, తద్వారా నార్కో- -టెర్రరిజానికి పాల్పడుతున్నారనే కారణాలు చూపుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనుజులాపై వైమానిక దాడులు చేయించారు. అమెరికన్ ప్రత్యేక బృందాలు శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధానితోపాటు మరో ఆరుప్రాంతాలను టార్గెట్ చేసి బాంబుల వర్షం కురిపించాయి. అంతేకాదు.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను బందీలుగా అదుపులోకి తీసుకుని రహస్య స్థావరానికి తరలించడం కలకలం సృష్టించింది.
కరాకస్, జనవరి ౩: లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాపై అమెరికా మెరుపుదాడులు చేయించింది. శనివారం తెల్లవారుజా మున (భారత కాలమానం ప్రకారం అర్ధరా త్రి ౨ గంటలకు) అమెరికా సైన్యం వెనిజులా రాజధాని కరాకస్‌పై భీకరమైన వైమానిక దాడులకు దిగింది. ఈ క్రమంలోనే ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను అమెరికన్ ప్రత్యేక దళాలు (డెల్టా ఫోర్స్) బంధించాయి. అనంతరం వారిని ప్రత్యేక విమానంలో ఓ రహస్య స్థావరానికి తరలించాయి. ఈ పరిణామాలతో వెనిజులాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అమెరికా సైన్యం తెల్లవారుజామున కరాకస్ నగరంతోపాటు మిరాండా, అరాగ్వా, లా గ్వైరా వంటి ఏడుచోట్ల వైమానిక దాడులు చేసింది. వెనిజులా సైనిక స్థావరాలైన ఫోర్ట్ టీయునా, లా కారో టా ఎయిర్ బేస్‌ను టార్గెట్ చేసి అమెరికన్ సైన్యం ఈ దాడులకు పాల్పడింది. నగరంపై అమెరికన్ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తు లో వెళ్తూ బాంబుల వర్షం కురిపించాయి. దాడుల ధాటికి నగరంలో విద్యుత్ సరఫరా అర్ధంతరంగా నిలిచిపోయింది.
దీంతో ప్రజ లు భయాందోళనలకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థిలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని, కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ నిర్ధారించారు. తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా అధికారికంగా ధ్రువీకరించారు.
అమెరికా తీరుపై విమర్శల వెల్లువ
మదురోపై ఉన్న నార్కో -టెర్రరిజం ఆరోపణలు, డ్రగ్స్ స్మగ్లింగ్ కారణాల రీత్యా ఈ చర్య తీసుకున్నట్లు అమెరికన్ యంత్రాంగం ప్రకటించించింది. మరోవైపు ఈ దాడులను వెనిజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అమెరికా తమ దేశంలోని చమురు నిక్షేపాలను హస్తగతం చేసుకునేందుకే దాడులకు పాల్పడుతోందని వెనిజులా రక్షణశాఖ ఆరోపించింది. యుద్ధప్రాతిపదికన ఐక్యరాజ్యస మితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది.
దాడు లపై అంతర్జాతీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికన్ సైన్యం దాడులను తీవ్రం గా తప్పుబట్టాయి. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని రష్యన్ విదేశాం గ శాఖ విమర్శించింది. ఇతర లాటిన్ అమెరికన్ దేశాలైన కొలంబియా, పెరూ, చిలీ వంటి దేశాలు స్పందించాయి. అమెరికా దాడులు సరికావని తేల్చి చెప్పాయి.
క్యూబా కూడా అమెరికా సైనిక చర్యపై విమర్శలు గుప్పించింది. అమెరికా తక్షణం దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా ఎక్కడికి తరలించింది? వెనిజులాలో తదుపరి పాలన ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మదురో అరెస్టుతో లాటిన్ అమెరికాలో ఎలాంటి రాజకీయ సంక్షోభం వస్తుందో.. ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
1989 తర్వాతే ఇదే తొలిసారి
1989లో పనామా పాలకుడు మాన్యుయెల్ నోరియెగాను బంధించిన తర్వాత, ఒక దేశాధినేతను అమెరికా దళాలు నేరు గా అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా దాడులు, దేశాధ్యుక్షుని అపహరణతో అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పరిణామం లాటిన్ అమెరికన్ దేశాలతోపాటు కరేబియన్ దేశాలకు పెను ముప్పుగా పరిణ మించే అవకాశం ఉందని ప్రజాస్వామికవాదులు అభిప్రాయపడుతున్నారు.
కరాకస్‌పై వైమానిక దాడుల నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో రాజకీయ గురువు హ్యూగో చావెజ్ ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో అమెరికా, వెని జులా మధ్య సంబంధాలు దృఢంగానే ఉండేవి. 1999లో హ్యూగో చావెజ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయా యి. సోష లిస్టు భావజాలం ఉన్న చావెజ్, అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరించడం మొదలుపెట్టారు.
చావెజ్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల వెనిజులాలోని సంపన్న వర్గా లు, చమురు సంస్థల ప్రతినిధులు తీవ్ర అసంతృప్తికి గురయ్యా రు. ఇదే సమయం లో చావెజ్‌ను గద్దె దించేందుకు 2002లో అమెరికా మద్దతుతో ఒక తిరుగుబాటు ప్రయత్నం జరిగిం ది. సైనిక అధికారులు చావెజ్‌ను అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చావె జ్ దేశాధ్య పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
తర్వాత తాత్కాలిక దేశాధ్యక్షుడిగా వ్యాపారవేత్త పెడ్రో కార్మోనా పీఠాన్ని కైవం చేసుకు న్నాడు. నాడు చావెజ్‌కు మద్దతు వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చి తిరుగుబాటుదారులను ఎదిరించారు. ప్ర జాందో ళనకు భయపడిపోయిన కుట్రదారులు తోకముడిచారు. ఏప్రిల్ 13న చావె జ్ తిరిగి అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించారు. నాటి తిరుగుబాటుతో తమకేమీ సంబం ధం లేదని నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ బుకాయించినప్పటికీ, ఆ తర్వాత వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికన్ ప్రభుత్వమే తిరుగుబాటుదారులతో రహ స్య చర్చలు జరిపి, కుట్రకు పాల్పడినట్లు వెనిజులా నిఘా వర్గాలు తేల్చాయి.
వైమానిక దాడులు మా దేశంపై దురాక్రమణే!
అమెరికా మా దేశ సార్వభౌమాధికా రంపై దాడి చేస్తోంది. అమెరికా కావాలనే మా దేశంపై దురాక్రమణకు పాల్పడుతోంది. ప్రస్తుతం మా దేశాధ్యక్షుడు మదురో ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు. ఆయన ప్రాణాలకు ము ప్పు ఉంది. పరిస్థితులు చేతిలోకి వచ్చే వరకు వెనిజులాలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం. దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరింపజేస్తున్నాం. అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించా లి. ఐక్యరాజ్య సమితి యుద్ధప్రాతిపదికన అత్య వసర సమావేశం (ఐరాస) నిర్వహించాలి.
వెనిజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్
బస్ డ్రైవర్ నుంచి అధ్యక్షుడిగా ప్రస్థానం
నికోలస్ మదురో తొలిరోజుల్లో బస్సు డ్రైవర్‌గా మదురో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, రాజకీయాల్లో రాణిస్తూ ఒక దేశాధ్యక్షుడిగా ఎదిగారు. 1962లో కారకాస్‌లో జన్మించిన మదురోది బాల్యం, యవ్వ నం సాదాసీదా సాగింది. హ్యూగో చావెజ్ నేతృత్వంలో ని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలా (పీఎస్యూవీ) పార్టీలో చేరిన తర్వాత ఆయన దశ తిరిగింది.
చావెజ్ ప్రభుత్వంలో మదు రో 2006 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. లాటిన్ అమెరికా- కరేబియన్ (ఏఎల్బీఏ) కూటమి ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. 2012 లో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 2013లో చావెజ్ మరణంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశాన్ని దశా బ్దానికిపైగా పాలించిన మ దురో రాజకీయప్రస్థానం మున్ముందు ఎలాంటి కుదు పులకు లోనవుతుందోననే ప్రశ్నలు తాజా గా వెల్లువెత్తాయి.
వెనిజులాపై వైమానిక దాడులు వాస్తవమే
కరాకస్ నగరంపై అమెరికన్ సైన్యం వైమానిక దాడులు వాస్తవమే. అలాగే మా సైన్యం ఆ దేశాధ్యక్షుడు మదురోతోపాటు ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ని తరలించిన సంగతి నిజమే. మదురో దంపతులను అమెరికన్ చట్టాల ప్రకారం అదుపులోకి తీసుకున్నాం. అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ప్రత్యేక సైనిక దళాల సమన్వయంతో ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఇది అద్భుతమైన విజయం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్