calender_icon.png 7 January, 2026 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు గట్లమల్యాల విద్యార్థిని

06-01-2026 03:00:56 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండల పరిధిలోని గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బానోతు ఈశ్వరి జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల మనోహరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఈశ్వరి, ఈ నెల 9 నుండి 12 వరకు హర్యానాలో జరిగే సబ్ జూనియర్ జాతీయ పోటీల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థినిని,శిక్షణ ఇచ్చిన పీఈటీ రాజ్‌కుమార్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్, సర్పంచ్ ఇంగ నరేష్, ఎస్‌ఎంసీ చైర్మన్,ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.