06-01-2026 03:04:24 PM
బెజ్జంకి: సిద్ధిపేట జిల్లా బెజ్జంకి చెందిన అయ్యప్ప స్వాములు మంగళవారం ఇరుముడి ధరించి, శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు 41 రోజులపాటు ఎంతో కఠోరమైన దీక్షలను నియమ నిబంధనలతో పాటించారు. స్వాములకు జీకె శ్రీనివాసరావు అయ్యప్ప స్వాములకు ఇరుముడి కట్టారు. మండల కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇరుముడి నెత్తిన ధరించి శివాలయంలో, లక్ష్మీనరసింహస్వామి ఆలయంల చుట్టూ ప్రదక్షిణలు చేసి శబరిమల బయలు దేరి వెళ్లారు. అయ్యప్ప స్వాముల బంధుమిత్రులు, అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప స్వాముల ఆశీర్వాదాన్ని పొందారు. శబరిమల యాత్రలో గురు స్వాములు బొమ్మిడి లక్ష్మణ్, విలసాగరం ప్రసాద్, సాయి, అరవింద్, సత్తయ్య,సాయికిరణ్, అశోక్, సంతోష్, శ్రీనివాస్, అనిల్ శివ, సత్యనారాయణ, చిరంజీవి, దత్తు, కన్నె స్వాములు, కత్తి, గద స్వాములు వున్నారు