calender_icon.png 23 December, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి డేను నీరుగార్చే కుట్ర

23-12-2025 01:35:28 PM

శ్రీరాంపూర్ ఓసిపిలో ఏఐటీయూసీ నిరసన

మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా సింగరేణి డే వేడుకలను(Singareni Day celebrations) పెద్ద ఎత్తున అట్టహాసంగా నిర్వహించకుండా తూతూ మంత్రంగా నిర్వహించాలనే యాజమాన్య నిర్ణయానికి వ్యతిరేకంగా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఓసిపిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃసమీక్షించి, సింగరేణి డే వేడుకలను గౌరవప్రదంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

వేల కోట్లు లాభాలు తెచ్చి పెడుతున్న సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎంతో అట్టహాసంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమైతే సింగరేణి యాజమాన్యం అరకొర నిధులు కేటాయించి వారి ఆనందాన్ని నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ కార్యదర్శి ఎస్‌కే బాజీ సైదా, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, జీఎం కమిటీ సభ్యులు బద్రి బుచ్చయ్య, నాగభూషణం, పిట్ సెక్రటరీ మోతె లచ్చన్న, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ నల్లపు సత్తయ్య, ఇత్తినేని శంకర్, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు కటకం లక్ష్మణ్, శంకరయ్య, శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ నాయకులు రాజేశ్వరరావు, మల్లెత్తుల శ్రీనివాస్, రాజమౌళి, ఎస్ఆర్‌పీఓసిపి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు.