23-12-2025 02:54:45 PM
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య
తుంగతుర్తి,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు గొప్ప.గొప్ప. మాటలు చెప్పి అధికారానికి వచ్చి.. కనీసం పంటకు కావలిసిన యూరియా కూడా సరిపడా సప్లై చేయలేక గత వానకాలం సీజన్ లో ఎరువుల దుకాణల ముందు పడిగాపులకు గురించేసిన సంగతి మరువకముందే. యూరియా యాప్ అంటు రైతంగాన్ని ఇబ్బందులకు గురించేస్తుంది.. నిరక్ష రాస్యు లై స్మార్ట్ ఫోన్ లేనటువంటి రైతాంగం ఎంతోమంది వ్యవసాయం చేస్తున్నారు.
వాళ్లకు కావాల్సిన యూరియా ఎక్కడ తెచ్చుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళలో సైతం యాప్ డౌన్ లోడ్ చేసుకోరాక పోవడంతో దిక్కు తోచని స్థితిలో రైతాంగం స తమాతమౌతుంది. ఎరువుల యాజమాన్యం మాత్రం ఆన్లైన్ చేసుకుంటేనే ఇస్తామని ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు ఆరోపించారు.
రైతుల శ్రేయిభిలాషులమనే కాంగ్రెస్ ప్రభుత్వం సరిపడా యూరియా సీజన్ కన్నా ముందే తెప్పించి రైతాంగానికి కావాల్సినంత సరఫరా చేయాలి గాని అర్ధం.. పర్ధం లేని విధానాలతో రైతంగాన్ని ఇబ్బందులకు గురిచేయాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. మీ వ్యవసాయ అధికారుల లెక్కలతో సరిపడా యూరియా తెప్పించి యాప్ ద్వారా కాకుండా, సప్లైయ్ చేయాలనిఅన్నారు..అధికారానికి రావడానికి అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చకుండా మోసపూరిత పాలనచేస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్ పాల్గొన్నారు