calender_icon.png 23 December, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ నేషనల్స్ రాష్ట్ర జట్టు మేనేజర్ గా పుల్లూరి సుధాకర్

23-12-2025 01:33:54 PM

మంచిర్యాల, (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్న సీనియర్ నేషనల్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్న తెలంగాణ రాష్ట్ర జట్టు మేనేజర్ గా స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పుల్లూరి సుధాకర్ ను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రెటరీ పుల్లెల గోపీచంద్ నియమించారు.

రాష్ట్ర బ్యాడ్మింటన్ జట్టు క్రీడాకారులు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్ విభాగాలలో పాల్గొననున్నారు. రాష్ట్ర జట్టు మేనేజర్ గా ఎంపిక చేసిన పుల్లెల గోపీచంద్ కు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రావు, ఈవెంట్స్ అండ్ ప్రోటోకాల్ జాయింట్ సెక్రెటరీ యు వి ఎన్ బాబు, ట్రెజరర్ వంశీలకు  సుధాకర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్స్ బ్యాడ్మింటన్ రాష్ట్ర జట్టు మేనేజర్ గా ఎంపికైన పుల్లూరి సుధాకర్ ను స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, ఉపాధ్యక్షులు భాస్కర్ల వాసు, బండ మీనా రెడ్డి, ట్రెజరర్ సత్యపాల్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రమేష్ రెడ్డి, సభ్యులు లక్ష్మీనారాయణ, హర్ష అభినందించారు. సుధాకర్ ఇంతకుముందు అండర్ 15, అండర్ 17, అండర్ 19, సీనియర్స్ రాష్ట్ర జట్లకు మేనేజర్ గా వ్యవహరించారు.