calender_icon.png 16 July, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాలకు యువత దూరం ఉండాలి: విజయపురి ఎస్ఐ ముత్తయ్య

16-07-2025 05:23:26 PM

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

డ్రగ్స్‌కు బానిస కావొద్దు, భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దు. సాగర్ పోలీస్

నాగార్జునసాగర్,(విజయక్రాంతి): మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, విజయపురి ఎస్ఐ ముత్తయ్య అన్నారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.మత్తు పదార్థాల నిర్మూలనపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై ముత్తయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు.

కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పకూడదని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలని వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఎవరైనా రవాణా చేసిన, విక్రయించిన సమాచారం అందించాలని కోరారు.