03-01-2026 12:46:52 AM
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు సంబంధించిన జోన్-1 పనులకు రూ. 4,100 కోట్ల నిధులను ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంగీకరించిందని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. జోన్--1కు సంబంధించిన డీపీఆర్ తయా రీ కూడా పురోగతిలో ఉందని తెలిపారు. శుక్రవా రం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ పునరుజ్జీవంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం ఇచ్చారు.
మూసీ నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్ హార్ట్ సింగపూర్ ప్రైవేటు లిమిటెడ్ (లీడ్ మెంబర్), మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, మెసర్స్ ఆర్‌ఏఓఎస్ డిజైన్ స్టూడియో ప్రైవేటు లిమిటెడ్‌తో కూడిన కన్సార్టియంను ఎంఆర్‌డీసీఎల్ నియమించుకున్నదని తెలిపారు. ఉస్మాన్‌సాగర్ నుంచి గౌరెల్లి వరకు, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు కన్సార్టియం అధ్యయనం, ప్రణాళిక, విశ్లేషణ, డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు డీపీఆర్లను సమర్పిస్తుందని వెల్లడించారు.
బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, లాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్ వ్యూ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయల మా స్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్‌ల డీపీఆర్‌ల తయారీ పురోగతిలో ఉందని పేర్కొన్నారు. మూసీ, ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మాగాంధీ బోధనా తత్వాన్ని కొనసాగేలా చూసేందుకు అంకితమైన ప్రపంచ స్థా యి అనుభవ కేంద్రమైన గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్టు చెప్పారు. ప్రస్తుతం కాన్సెప్చువల్ ప్లాన్ పూర్తయిందని, దీని కోసం రక్షణ శాఖ భూ ములను సేకరించవలసి ఉంటుందన్నారు. భూముల బదిలీకి ప్రతిపాదనలను కూడా ర క్షణ శాఖ అధికారులకు సమర్పించామన్నారు.
ఐదు జోన్లుగా..
ప్రాజెక్టును 5 జోన్లుగా విభజించామని, మొదటి దశలోని 55 కి.మీ.లకు గానూ 21 కి.మీల (ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్) వరకు గల జోన్--1 రీచ్‌ను ఎంఆర్‌డీసీఎల్ చేపడుతుందని, దీ నికి గానూ ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధు లు ఇవ్వడానికి అంగీకరించిందని తెలిపారు. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటిని విడుదల చేసే నిమిత్తం రూ.3,188 కోట్ల కోసం ఎన్‌ఆర్‌సీపీ (జాతీయ నది పరిక్షణ ప్రణాళిక) కింద నిధులను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ జల్ శక్తి మంత్రిత్వశాఖను తెలంగాణ ప్రభు త్వం కోరిందని, ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక (పీపీఆర్)ను సమర్పించామని, కేంద్ర ప్రభు త్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే డీపీఆర్‌ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు నదీ సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉందని, సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా, పర్యాటకులకు సౌకర్యాల తో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్ల ను యోచిస్తున్నట్టు వివరించారు.
2.5 టీఎంసీలు రిజర్వ్..
మూసీ నదిని శుభ్రపరచడానికి నివేదిక పురోగతిలో ఉందని, తదుపరి ఎస్‌టీపీలు, మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాలువలు బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలో భాగంగా ఉన్నాయని తెలిపారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి పంప్ చేయడాన్ని చేపట్టిందని, మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 టీఎంసీలను రిజర్వ్ చేసినట్టు పేర్కొ న్నారు. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ కేఎన్‌ఆర్ కన్‌స్ట్ట్రక్షన్స్ లిమిటె డ్‌ను అప్పగించామని చెప్పారు.
మూసీ పునరుజ్జీవంపై కొంతమందికి ఇబ్బంది అయినా ప్రజల అవసరాలను తీర్చే ఉద్దేశంతో ప్రాజెక్టు చేపడుతున్నామని స్పష్టం చేశారు. డీపీఆర్ లేకుండానే గతంలో కొన్ని ప్రాజెక్టులను చేపట్టారని, కానీ తాము శాస్త్రీయ పద్ధతిలో ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. జోన్-1 డీపీఆర్ వచ్చే ౪వారాల్లో పూర్తి అవుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి-మార్చిలో పనుల కూడా ప్రారంభించాలని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన జోన్- 1 పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు.