03-01-2026 12:50:23 AM
మూసీ కంపు :
వారి కడుపులోనే ఉంది
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవర్ 2 (విజయక్రాంతి) : మూసీలో ఉన్న కాలు ష్యం కం టే వీళ్ల కడుపుల్లోనే ఎక్కువ విషం ఉందని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ విషా న్ని బయటకు చిమ్ముతున్నారని బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి విమర్శించారు. కొంతమంది కడుపుల్లో ఉన్న విషం మూసీ కాలుష్యం కంటే అత్యంత ప్రమాదకరమని ఎద్దేవా చేశారు. ఎవరి పేర్లు ప్రస్తావించకుం డా, అసెంబ్లీలో వివరాలు చెప్పే ప్ర యత్నం చేస్తుంటే ఎందుకు విషం కక్కుతున్నారని మండిపడ్డా రు. స్పీకర్ అనుమతి ఇచ్చాక ప్రశ్నించేందు కు మీరెవరని అన్నా రు.
మీ ప్రాధాన్యత ఏంటో స్పష్టమవుతున్నదని, ఈ చర్చ జర గొద్దని, నిజాలు ప్రజలకు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారని, వివరాలు చెబుతుంటే నొప్పి ఎందుకు అని ప్రశ్నించారు. వారి కళ్ల నిండా విష మే ఉందని, వారి కళ్లకు శక్తి ఉంటే.. ఆ విషపు కళ్లతో చూస్తే మొత్తం కాలి బూడిదయ్యేటట్టు ఉందని ఆయన అన్నారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు వారు అద్దాలు పెట్టుకుంటున్నా రని ఎద్దేవా చేశారు. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయని చెప్పారు.
మూసీ ప్రక్షాళన చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొందరు కోరుతున్నారని, వారి చూసైన నేర్చుకోవాలని విమర్శించా రు. మూసీ పరీవాహక ప్రాంత పేదలకు మె రుగైన వసతులు కల్పిస్తామంటే, వాళ్లు అలా గే ఉండాలన్నట్లుగా ప్రతిపక్షం ప్రవర్తిస్తున్నదని విమర్శించారు. అసలు మూసీ ప్రక్షాళన చేయాలంటున్నారా, వద్దనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కావాలనుకుంటే సూచనలు ఇవ్వాలని, వద్దనుకుంటే.. మీ కడుపు మంట బయటపెడితే ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.
మూసీకి సంబంధించిన వివారాలన్నీ చెప్పేందుకు అభ్యంతరమేమీ లేదని తెలిపారు. ‘కడుపు మంటకు ఒకవేళ మందు లేకపోతే వికారాబాద్ చరిత్ర గురించి తెలు సు కదా.. వికారాబాద్ హావా లాఖోం మరిజోంఖా దవా, ఏ మరిజ్ లో గోంఖో లేజాకే వికారాబాద్ మే షరికర్వాదో అధ్యక్ష’ అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి వికారాబాద్ తీసుకెళ్లి కట్టేయాలని, లేకపోతే మామూలు మనుషులు కాలేరని విమర్శించారు.
ఆయన మాటల్లోనే ఉంది
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి) : మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉందని, సభా నాయకుడి హోదాలో ఉండి ఆయన మాట్లాడుతున్న భాష వినడానికే చాలా కష్టంగా, అసహ్యంగా ఉంద ని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అసెంబ్లీలో పాయిం ట్ ఆఫ్ ఆర్డర్‌పై హరీశ్‌రావు మాట్లాడు తూ.. స్పీకర్ సభకు కస్టోడియన్ అని, ఈ సభలో అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా ఎమ్మెల్యేలందరికీ సమాన హక్కులు ఉంటాయని, వాటిని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందన్నారు. మా గొంతు నొక్కుతున్నప్పుడు స్పీకర్ ప్రొటెక్ట్ చేయాలని సూచించారు.
బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు కనీసం ఏడురోజుల పాటు నడుపుతామని అందరి సమ క్షంలో నిర్ణయించామని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ బీఏసీ మీటింగ్ పెట్టి పొడిగింపుపై నిర్ణయిద్దామని అనుకున్నామని తెలి పారు. కానీ ఆశ్చర్యకరంగా బీఏసీ మినిట్స్‌లో ఆ ఏడు రోజుల ప్రస్తావన ఎందుకు పొందుపరచలేదని, సభలో తీసుకున్న నిర్ణయానికి మినిట్స్‌లో పొంతన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ఎజెండా కాపీలు తెల్లవారుజామునా?
సభలో జరగబోయే బిజినెస్ గురించి, ఎజెండా కాపీలను తెల్లవారు జామున 2, 3 గంటలకు పంపిస్తున్నారని, సభ్యులు ఎప్పు డు నిద్రలేవాలి, ఎప్పుడు చదువుకోవాలి.. సబ్జెక్ట్ మీద ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలని నిలదీశారు. సభ ప్రారంభానికి కనీసం 24 గంటల ముందు ఎజెండాను సభ్యులకు పంపాలనేది ఈ సభ ఆనవాయితీ అని గుర్తుచేశారు. ఆ సాంప్రదాయాన్ని ఎందుకు పాటించడం లేదని, దీనివల్ల అర్థవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోందన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే మాకు సమాధానం చెప్పాల్సింది పోయి, సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి లేచి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మేము అడిగిన ఏ ఒక్క పాయింట్‌కు సీఎం దగ్గర క్లారిఫికేషన్ లేదని, పైగా మాకు మైక్ ఇవ్వకుండా, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటెస్ట్ చేయడం సభ్యుడి హక్కు అని, మాకు మైక్ ఇవ్వకపోవడం ముమ్మాటికీ సరికాదన్నారు.