calender_icon.png 6 October, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో అండగా అఖిల రాజ్ ఫౌండేషన్

06-10-2025 06:02:14 PM

దౌల్తాబాద్: సమాజంలో ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, మానవతా విలువలను నిలబెడుతున్న అఖిల రాజ్ ఫౌండేషన్ మరొకసారి తన సేవా మనసును చాటుకుంది. ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండలంలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కావేటి రాములు కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ “సమాజంలో సహాయం అవసరమైన ప్రతి కుటుంబం పక్కన నిలవడం మా ఫౌండేషన్ ధ్యేయం. ఆర్థికంగా వెనుకబడిన వారు, విద్యాపరంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సహాయం అందించేందుకు అఖిల రాజ్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యులు ఫౌండేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.