06-10-2025 06:04:50 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ నాయకులు జాడి బాల్ రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 10 సంవత్సరాలు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా దోసుకుతిన్నారని, గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసా కూడా లేదని, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని బీఆర్ఎస్, కాంగ్రెస్ చేస్తున్న వాగ్దానాలను, నమ్మి మళ్లీ మోసపోవద్దని ఓటర్లను కోరారు.