30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

కరాటేలో అక్షిత్ మనివర్ధన్‌కు బ్లాక్ బెల్ట్

05-05-2026 10:09 AM

జనగామ, (విజయ క్రాంతి): జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓరుగంటి అక్షిత్ మనివర్ధన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించగా, నిక్షిత్ మణివర్ధన్ బ్రౌన్ బెల్ట్‌లో షోధాన్ సర్టిఫికేట్ పొందినట్లు కరాటే మాస్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా చీఫ్ రంగు మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో ఈ విజయాలు సాధించారు. ఈ సందర్భంగా అక్షిత్ మనివర్ధన్, నిక్షిత్ మణివర్ధన్‌లను విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ గౌరవ అధ్యక్షుడు, సినీ హీరో సుమన్ తల్వార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సీనియర్ మాస్టర్లు శ్రీనివాస్, వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.