04-05-2025 01:11:30 AM
వరుసగా రెండోసారి ప్రధాని కుర్చీ కైవసం
కాన్‌బెర్రా, మే 3: ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోని ఆల్బనీస్ ఎన్నికయ్యారు. ఆయన ప్రధాని కుర్చీని కైవసం చేసుకోవడం ఇది వరుసగా రెండోసారి. సార్వత్రిక ఎన్నికల్లో ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ విజయఢంకా మోగించింది. తద్వా రా 2004 తర్వాత వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టిన నేతగా ఆల్బనీస్ రికార్డులకెక్కారు.
ఆయన మరో మూడేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ ఓటమిని అంగీకరించారు. ఆస్ట్రేలియా ప్రతినిధుల సభలోని 150 స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మెజార్టీ మార్కు (76) క్రాస్ చేసింది. ఆల్బనీస్ 2022 నుంచి ఆస్ట్రేలియా ప్రధానిగా కొనసాగుతున్నారు. వరుసగా రెండోసారి ఆసీస్ ప్రధానిగా ఎన్నికైన ఆల్బనీస్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.