04-05-2025 01:14:23 AM
న్యూఢిల్లీ, మే 3: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ నడుమ ఉద్రిక్తత లు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్‌ను పాక్ మరింత కవ్విస్తోంది. క్షిపణిని పరీక్షించినట్టు తాజాగా పాక్ వెల్లడించింది. మరోవై పు పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చే శారు. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు భారత్ ప్రకటించిన విష యం తెలిసిందే.
అయితే సింధూ నది జలాలను మళ్లించేందుకు ఏ నిర్మాణం చేపట్టినా దానిని ధ్వంసం చేస్తామని పాక్ మం త్రి పి చ్చి కూతలు కూశారు. పాక్ సరిహద్దు వెం బడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. వరుసగా తొమ్మిదో రో జు కూడా పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు.
బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాక్
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణిని పాకిస్థాన్ పరీక్షిం చింది. అబ్దాలి వెపన్ సిస్టమ్‌గా పిలిచే ఈ క్షిపణి రేంజ్ 450 కిలోమీటర్లుగా పాక్ పేర్కొంది. సైనిక డ్రిల్ ‘ఎక్సర్‌సైజ్ ఇండస్’ లో భాగంగా పాక్ ఈ క్షిపణిని శనివారం విజయవంతంగా పరీక్షించినట్టు పేర్కొంది. ఈ పరీక్షను సోన్మయిని ప్రాంతంలో విజయవంతంగా పరీక్షించింది. ‘
సైనికుల కార్యాచర ణ, సంసిద్ధత నిర్ధారించడం కోసం ఈ ప్రయోగం చేపట్టాం’ అని పాకిస్థాన్ ఆర్మీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్షిపణి పరీక్ష కార్యక్రమంలో ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ ర్, స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ సీనియర్ అధికారులు, ఆర్మీ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పాకిస్థాన్ చర్యలను భారత్ తీవ్రంగా ఖండిం చింది. నిర్లక్ష్యపు కవ్వింపు చర్యలుగా అభివర్ణించింది.
ఆగని కాల్పులు
పాకిస్థాన్ సరిహద్దుల వెంట కాల్పులు జరుపుతూనే ఉంది. వరుసగా తొమ్మిదో రోజు కూడా ఆ దేశం కాల్పుల విరమణ ఒ ప్పందానికి తూట్లు పొడిచింది. శుక్రవారం రాత్రి కుప్వారా, ఉరి, అక్నూర్ ప్రాంతాల్లోని ఎల్‌వోసీ వెంట కాల్పులకు దిగింది. ఈ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా సమాధానం ఇచ్చింది. భారత్ పాకిస్థాన్‌తో 3,323 కిలోమీటర్ల మేర భూసరిహద్దును పంచుకుంటోంది.
ఏం నిర్మించినా ధ్వంసం చేస్తాం: పాక్ రక్షణ మంత్రి
సింధు జలాల మళ్లింపు కోసం భారత్ ఏం నిర్మించినా కూల్చేస్తామని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పిచ్చికూతలు కూశారు. పాక్‌లోని 80 శాతం వ్యవసాయ భూభాగానికి సింధూ జలాలే ప్రధాన ఆధారం. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్.. పాకిస్థాన్ బెదిరింపులు ఆ దేశం ఎంతలా భయపడుతుందో చూపుతున్నాయని ఎద్దేవా చేశారు.