calender_icon.png 12 August, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్

12-08-2025 01:26:32 AM

వైద్యాధికారి డాక్టర్ మనోజ్‌రెడ్డి

ముషీరాబాద్, ఆగస్టు 11(విజయక్రాంతి) : పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సంవత్సరం నుంచి 19ఏళ్ల వయసుగల పిల్లలకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మనోజ్ రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్క రించుకొని ముషీరాబాద్ యూపీహెచ్సీలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశా రు.

ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ... పిల్లలు పౌష్టికాహార లోపం, రక హీనతల వల్ల నీరసంగా ఉంటారని పేర్కొన్నారు. శారీరక, మానసిక అభివృద్ధిలో మందకోడిగా ఉంటారని పేర్కొన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్చమైన నీరు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ మల విసర్జన, అపరిశుభ్రత వాతావరణం వల్ల అనారోగ్య సమస్యలు ఉత్పన్న మవుతాయని పేర్కొన్నారు. స్కూల్స్, కాలేజీలు, ప్రధాన కూడళ్లలో చిన్నారులను గుర్తించి ఆల్బెండజోల్ మాత్రలు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.