05-09-2025 12:00:00 AM
పార్టీలో నెంబర్ స్థానం కేసీఆర్‌దే
కవిత ఆరోపణలు దురదృష్టకరం
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : ఊరుకో కంపెనీ పెట్టి అందరితో బీర్లు తాగించేలా కాంగ్రెస్ ప్రభుత్వ మద్యం విధానం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ తెస్తామంటే మద్య నిషేధం ప్రకటిస్తారేమో అనుకుంటే, కొత్తగా మైక్రో బ్రూవ రీలను తెరుస్తామని పాలసీ ప్రకటించారని ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడా రు.
యువతను మద్యం మత్తులోకి దించేలా పాలసి ఉంద ని, నీరా కేఫ్‌లు తెరవాలని తాము అంటే, ఊరూరా బీరు షాపులు తెరుస్తున్నారని విమర్శించారు. బెల్ట్ షాపులు ఎత్తి వేస్తామని చెప్పి వాటి సంఖ్య పెంచుతు న్నారని, ఆదాయం పెంచుకునే పేరిట విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమ తి ఇవ్వబోతున్నారని ఆరోపించారు. మద్యం పాలసీకి యువత ప్రాణాలు బలి పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చ రించారు.
రాష్ర్ట ప్రజలందరూ కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేసుకుంటామంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వంపై సంతోషంగా లేరని స్పష్టం చేశారు. ప్రతీ బీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్‌ను మూడోసారి సీఎంగా చేసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. హరీశ్‌రావు, సంతోష్ రావు కేసీఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, పార్టీలో నెంబర్ వన్ స్థానం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. కవిత ఆరోపణలు దురదృ ష్టకరమన్నారు.