05-09-2025 12:00:00 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ ఎదులా బాద్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల లలిత కలల పాఠశాలలో సమగ్ర శిక్ష మేడ్చల్ జిల్లా స్థాయి కళా ఉత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్య శాఖ అధికారి విజయ కుమారి సమక్షంలో 12 వివిధ విభాగాలలో 74 పాఠశాలలు 132 విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారిలో మొదటి, రెండవ స్థానం న్యాయ నిర్ణీతల సహాయంతో ఎంచుకోవడం జరిగింది. వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు.
ఈకార్యక్రమం నిర్వహించుటకు స్థానిక మండల విద్యాధికారి శ్రీధర్, స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ రాము, జిసిడిఓ మేడం హేమలత, పద్మజ, జ్యూరీ మెంబర్స్ చైతన్య, కిషన్, ధర్మపాల్, వాసవి, చౌదరి, రమ్య, వేణి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.